భారతదేశంలోనే అతి ప్రాచీన భాష అయిన తెలుగు భాషను మాట్లాడేవారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9కోట్ల 60 లక్షల మంది ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు 17వ స్థానంలో ఉండటం ముదావహం. అయితే, నేటి ఆధునిక కాలంలో ఆంగ్లభాషపై పెరిగిన మక్కువ, సాంకేతిక రంగాలలో ఉన్నత స్థాయికి చేరాలన్న తాపత్రయం మన మాతృభాష పట్ల సవతి తల్లి ప్రేమను చూపేటట్లు చేస్తోంది అనటం నిర్వివాదాంశం.
ఏదిఏమైనప్పటికి అమ్మభాషను కాపాడుకోవల్సిన ఆవశ్యకత అమ్మ ఒడిలో పెరిగిన ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని ప్రవాసాంధ్రులు ప్రతి పట్టణంలోనూ తెలుగుబడులను ఏర్పాటు చేసి ఇక్కడ పెరుగుతున్న పిల్లలకు మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను నేర్పించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
నేడు తెలుగు భాషాదినోత్సవ సందర్భంగా, పెర్త్ తెలుగుబడి పిల్లలు చిన్న కదంబ కార్యక్రమాన్ని మీ అందరి కోసం సమర్పిస్తున్నారు. ఈ చిన్నారుల మాటలను, పాటలను, పద్యాలను, కథలను విని ఆనందించండి. వీరికి మన భాషను నేర్పడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను, తల్లితండ్రులను అభినందించండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.