Podcast Series
•
తెలుగు
•
Society & Culture
తెలుగు భాషా దినోత్సవం
తెలుగు రచయితల ఆలోచనాధారలో మార్పులు తెచ్చి సాహిత్య ప్రవాహాన్ని గ్రాంధిక భాష నుంచి వ్యావహారిక భాషకు మరల్చిన వ్యావహారిక భాషా పితామహుడు, అభినవ వాగమశాసనుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. 1919లో ‘తెలుగు’ అనే మాసపత్రికను స్థాపించి మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతికరంగాలలో పురోగతి సాధించాలంటే వాడుక భాషలో పాఠ్యగ్రంధాలుండాలని వ్యావహారిక భాషావాదాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు. ప్రాచీన కావ్యాలను, వ్యాకరణాలను గౌరవిస్తూనే, భాషాభివృద్ధిని కొంతపుంతలు తొక్కించిన వ్యావహారిక భాషా కర్షకుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. వారి జన్మదినమైన ఆగష్టు 29వ తేదిని తెలుగు జాతి అంతా తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకుంటోంది. ఈ తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని, తెలుగ భాష ఔనిత్యాన్ని చాటే కార్యక్రమాలను ఈ నెలలో ప్రతి గురువారం SBS తెలుగు భాషాభిమానులకు, తెలుగు శ్రోతలకు అందించనుంది.