శతకాలు, పురాణాల వలె కథా ప్రధానమైనవి కావు. అలాగని ప్రబంధము వలె వర్ణనా ప్రధానము, గేయాల వలె సంగీత ప్రధానమైనవి కూడా కావు. అయితే శతకానికి మకుటం, సంఖ్య, వృత్తం, రస, భాషా నియమాలున్నాయి. శతకం అంటే 100. 100 నుంచి 108 పద్యాల సమాహారమే శతకము. వందకి తక్కువగా ఒక్క పద్యమున్నా అది శతకమనిపించుకోదు. అలాగే శతకాలన్నింటికి విధిగా చివరన మకుటముండాలి. ‘విశ్వధాభిరామ వినురవేమ’, ‘దాశరథీ కరుణా పయోనిథీ’ ఇలా అన్నమాట.
కాగా, ‘మాకు ప్రసన్నుడయ్యెన్’ అన్న మకుటంతో ఆదికవి నన్నయ్య రాసిన నాలుగు పద్యాలు శతక సాహిత్యానికి ఓంకారాన్ని దిద్దటం విశేషమనే చెప్పుకోవాలి.మన తెలుగులో దాదాపు 5000కు పైచిలుకు శతకాలున్నాయని భాషా పరిశోధకులు తెలుపుతున్నారు. ఎన్నో రకాల విషయాలపై మన తెలుగు కవులు శతకాలు రాసినప్పటికి భక్తి, నీతి శతకాలకే పెద్దపీట వేశారు. కృష్ణశతకము, నరసింహ శతకము, దాశరథి శతకము, శ్రీ కాళహస్తీశ్వర శతకం, సుమతి శతకము, భాస్కర శతకం, భర్తృహరి నీతి శతకం వంటివి ఆబాలగోపాలానికి చిరపరిచితాలే. శతకాలన్నీ కేవలం రసాపోషణకే అనుకుంటే పొరపాటే.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.