2024 లో టాలీవుడ్ హవా .. కొన్నిహిట్లు- బోళ్లు ఫ్లాపులు..

Movies

The trend of making movies in two parts, starting with Baahubali, and releasing them pan-India continues in 2024. Big-budget films and ticket price hikes for top heroes are becoming common, but this year, even these films are facing challenges at the box office. Source: Pixabay

బాహుబలితో మొదలైన రెండు భాగాలుగా సినిమాలు తీయడం, పాన్ ఇండియాగా విడుదల చేయటం అనే ట్రెండ్ ఇప్పుడు శృతి మీరి రాగాన పడుతోంది. ఏ సినిమా చూసినా రెండు భాగాలుగా నిర్మించి, విడుదల చేస్తున్నారు. ఒక వేళ ఇదివరలో విడుదలై ఉంటే సీక్వెల్ పేర రెండో సినిమా తీస్తున్నారు. 2024లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యింది.


పెద్ద హీరోల సినిమాలను భారీ వ్యయంతో నిర్మించటం, అది వసూలు చేసుకోవడానికి థియేటర్లలో టికెట్ల రేట్లను పెంచమని ప్రభుత్వాలను బ్రతిమాలుకోవడం కూడా సర్వ సాధారణం అయిపోయింది. పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తప్పక ఘన విజయం సాధిస్తాయి, వసూళ్లు రాబడతాయి అన్న నమ్మకం ఈ సంవత్సరం కొంచెం తడబడట్టుగా కన్పిస్తోంది.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share