2021-22 సంవత్సరంలో, సోలార్ మరియు విండ్ ఎనర్జీ ఉత్పత్తి, గృహ విద్యుత్ వినియోగాన్ని అధిగమించింది. సోలార్ ప్యానెల్స్ ఆధారంగా విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల వినియోగదారులకు తగ్గింపుతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది.
యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ నుండి Dr. Archie Chapman ఈ విషయాన్ని మరోసారి హైలైట్ చేస్తూ, "సౌర శక్తి విద్యుత్తు ఖర్చులను తగ్గించడంలో, అలాగే గ్రిడ్‌పై ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది" అని అన్నారు. అంతే కాకుండా, 2050 నాటికి సున్నా ఉద్గారాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న ఆస్ట్రేలియాలో సౌర శక్తి కీలక పాత్ర పోషిస్తుంది.ప్రభుత్వ పథకాలు మరియు అందుబాటులో ఉన్న రాయితీల గురించి తెలుసుకోవడానికి energy.gov.au ను సందర్శించండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.