ఎన్నికల విరాళాలలో కొత్త సంస్కరణలు..

Polling booth on election

Fierce debate over federal government's plan to overhaul political donations Source: SBS / SBS Radio

ఎన్నికల సంస్కరణలో భాగంగా, ఆల్బనీజీ ఆధ్వర్యంలోని లేబర్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు చేసే ఖర్చు, పార్టీలకు, అభ్యర్థులకిచ్చే విరాళాలపై పరిమితులను విధిస్తూ, పార్లమెంట్లో చట్టాన్ని ప్రవేశపెట్టనుంది.


పార్లమెంటు ఆమోదం పొందితే, జూలై 1, 2025 నుంచి ఈ చట్టం అమలులోకి రావచ్చు.ఈ నూతన సవరణలను అనుసరించి, ఒక అభ్యర్థికి ఒక సంవత్సరానికిగాను 20వేల డాలర్లకు మించి ఎవరూ విరాళాలు ఇవ్వడానికి వీలు ఉండదు. అలాగే, ఒక వ్యక్తి, కంపెనీ, వ్యాపార సంస్థల సంయుక్త విరాళాలు కూడా 6 లక్షల డాలర్లకు మించడానికి వీలు లేదు. అదే విధంగా, ఏ అభ్యర్థి ఎన్నికల నిమిత్తం 8 లక్షల డాలర్లుకు మించి, అదే రాజకీయ పార్టీలైతే, 90 మిలియన్ డాలర్లకు మించి ఖర్చు పెట్టడానికి వీలులేదు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share