American Academy of child and Adolescent Psychiatry వారి అధ్యయనాన్ని అనుసరించి, 90శాతం మంది 13 నుంచి 17 ఏళ్ల వయసుకు చెందిన యువత ఏదో ఒక సామాజిక మాధ్యమాన్ని వాడుతున్నారు. వీరిలో 75శాతం మంది సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు కలిగి ఉన్నారు. కాగా వీరు రోజు దాదాపు తొమ్మిది గంటలపాటు సామాజిక మాధ్యమాలపై తమ సమయాన్ని వెచ్చిస్తున్నారని ఈ సంస్థ తెలిపింది. దీనిబట్టే అర్థమవుతుంది, యువత ఈ సామాజిక మాధ్యమాలతో ఎంతగా మమేకమై మనుగడ సాగిస్తున్నారో. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ లేదా మెటా తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ప్రవేశపెట్టనున్న నిబంధనలు కొంత ఉపశమనం కల్గించవచ్చు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.