మోనాష్ యూనివర్శిటీకి చెందిన Dr. సుధా మొక్కపాటి గారు, అల్జీమర్స్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించగల వినూత్న రక్త పరీక్ష పరికరాన్ని అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే మొదటిసారి సెన్సార్ టెక్నాలజీతో అభివృద్ధి చేయబడిన పరికరం ఇది. అల్జీమర్స్ వ్యాధిని ముందుగానే గుర్తించి, సకాలంలో జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది. తెలుగు వారి ప్రతిభను చాటే ఈ అభివృద్ధిపై మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.